R.Krishnaiah: రిజర్వేషన్లను అడ్డుకుంటే తరిమికొడతాం: ఆర్. కృష్ణయ్య

by Prasad Jukanti |   (  Updated:2025-10-07 10:15:37  IST  )

బీసీల ఎదుగుదలను కొంత మంది ఓర్వడం లేదని ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు.

R.Krishnaiah: రిజర్వేషన్లను అడ్డుకుంటే తరిమికొడతాం: ఆర్. కృష్ణయ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్లను (BC reservations) అడ్డుకుంటే తరిమికొడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) హెచ్చరించారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీల ఎదుగుదలను కొంత మంది ఓర్వడం లేదని మండిపడ్డారు. బీసీలకు న్యాయం జరిగేందుకే హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశామన్నారు. ఇప్పటి వరకు బీసీలు ముఖ్యమంత్రి కాలేదని 42 శాతం రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు సమిష్టిగా కలిసి ముందుకు రావడం హర్షించతగిన పరిణామం అన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రతి దశలోనూ అగ్రకులాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. మా బతుకుమేము బతుకుతామంటే అడ్డుకుంటున్నారని మేము కూడా భారతీయులమేనన్నారు. అన్ని రంగాల్లో బీసీల వాటాకు తిలోదకాలు దిద్దారని, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అంతా అగ్రకులాల వారే అయ్యారు తప్పా ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదన్నారు.

Next Story