ఒక్క ఆవు, ఎద్దు, దూడను కోసినా ఊరుకునే ప్రసక్తే లేదు: రాజా సింగ్

by Ajay Maddhiboyina |

బ‌క్రీద్ పండుగ‌కు ఒక్క ఆవు, ఎద్దు, దూడ‌ను కోసినా ఊరుకునేది లేద‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చ‌రించారు. బ‌క్రీద్ పండుగ ఎలా జ‌రుపుకుంటారో మీ ఇష్టం కానీ ప‌శువుల జోలికి వ‌స్తే మాత్రం

ఒక్క ఆవు, ఎద్దు, దూడను కోసినా ఊరుకునే ప్రసక్తే లేదు: రాజా సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: బ‌క్రీద్ పండుగ‌కు ఒక్క ఆవు, ఎద్దు, దూడ‌ను కోసినా ఊరుకునేది లేద‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చ‌రించారు. బ‌క్రీద్ పండుగ ఎలా జ‌రుపుకుంటారో మీ ఇష్టం కానీ ప‌శువుల జోలికి వ‌స్తే మాత్రం ఊరుకునేది లేద‌ని ఖ‌బ‌డ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. లా అండ్ ఆర్డ‌ర్ స‌మస్య వ‌స్తే తాము బాధ్యులం కాద‌ని అన్నారు. రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి రాజు లాంటి వాడ‌ని, సీఎం రేవంత్ రెడ్డి గోమాత ప్రేమికుల‌ని చెప్పారు. కాబ‌ట్టి బ‌క్రీద్ నాడు గోవ‌ధ జ‌ర‌గ‌కుండా చూడాల‌ని సీఎంను విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని అన్నారు. లా అండ్ ఆర్డ‌ర్ డిస్ట్ర‌బ్ కావ‌ద్దు అంటే ఆవులు దూడ‌లు సిటీలోకి రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. ఇప్పకే ఓల్డ్ సిటీలో ఇత‌ర ప్రాంతాల్లో ఆవుల‌ను ఎద్దుల‌ను రోడ్డుపై పెట్టి అమ్ముతున్నార‌ని అన్నారు. మరోవైపు ఇప్పటికే బక్రీద్ సందర్భంగా గోవులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ కూడా హెచ్చరించారు.

Next Story