Sunstroke: బిగ్ అలర్ట్.. అస్సలు బయటికి వెళ్లకండి.. వడదెబ్బతో ఒకేరోజు 9 మంది మృతి

by Yella Dhawani Reddy |

దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి.

Sunstroke: బిగ్ అలర్ట్.. అస్సలు బయటికి వెళ్లకండి.. వడదెబ్బతో ఒకేరోజు 9 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతతో తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బ (Sunstroke) తగిలి సోమవారం ఒక్కరోజే 9 మంది మృత్యువాత పడ్డారు. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, గరిష్ఠంగా 44-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెండు, మూడు మినహా దాదాపు అన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఇక వడదెబ్బ కారణంగా ఖమ్మం, కరీంనగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కరు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో ముగ్గురు, వరంగల్‌లో ముగ్గురు మరణించారు. ఇక కామారెడ్డి జిల్లా బిచ్కుందలో సోమవారం అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒకవైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత భయపెట్టగా.. సాయంత్రం వేళ అకస్మాత్తుగా కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి.

వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

* ఎంత తీవ్రత నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.

* ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పుష్కలంగా నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి.

* చల్లటి నీటితో స్నానం చేయాలి. వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. లేత రంగుల్లో, కాటన్ వంటి తేలికపాటి దుస్తులు వేసుకోవాలి.

* ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. అత్యవసరమైతే గొడుగు, టోపీ వంటివి ఉపయోగించాలి.

* ఆల్కహాల్, కెఫీన్ వంటి శరీరాన్ని డీహైడ్రేట్ చేసే పానీయాలకు దూరంగా ఉండాలి.

* మసాలా ఫుడ్స్ కాకుండా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది.

* బయటకు వెళ్లేటప్పుడు నీళ్ల బాటిల్ తప్పకుండా తీసుకెళ్లాలి.

* కళ్లు మంటగా అనిపించినా, తల తిరిగినట్టు అనిపించినా వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలి.

Next Story