- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ ప్రస్తావన నా దగ్గర తెచ్చి నా నోరు పాడు చేయకండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkata Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావు, కేటీఆర్‌ల మధ్య కనీసం మాటలు కూడా లేవని, వారి ప్రస్తావన తెచ్చి తన నోరు పాడు చేయవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఒక్క పార్లమెంట్ సీటు గెలవలేని పార్టీ గురించి తనను ప్రశ్నలు అడగవద్దని ఈ సందర్భంగా మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వారి గురించి మాట్లాడి సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి ఘాటుగా స్పందించారు.
మరోవైపు, తెలంగాణ భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తోందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని, ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్ర పురోగతిపై తమ పూర్తి దృష్టి ఉందని గ్లోబల్ సమ్మిట్ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చిచెప్పారు.






