- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారి మాటలు నమ్మకండి : తెలంగాణ పోలీసుల హెచ్చరిక
'ఒకే ఒక్క క్లిక్‌తో ఈజీగా లోన్ వస్తుంది' అనే ప్రకటనలను నమ్మవద్దని తెలంగాణ పోలీసులు(Telangana Police) ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : 'ఒకే ఒక్క క్లిక్‌తో ఈజీగా లోన్ వస్తుంది' అనే ప్రకటనలను నమ్మవద్దని తెలంగాణ పోలీసులు(Telangana Police) ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఈ లోన్ యాప్‌లు ఈజీగా, ఎలాంటి అర్హతలు లేకపోయినా లోన్‌లు అందిస్తామని ఆకర్షిస్తాయని, కానీ వాస్తవానికి ఇవి సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను దొంగిలించేందుకు ఉపయోగించే మోసపూరిత యాప్‌లు అని తెలిపార. ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు వినియోగదారులు మొబైల్‌లోని కాంటాక్ట్‌లు, ఫోటోలు, సందేశాలు, కెమెరా, మైక్రోఫోన్ వంటి అన్ని రకాల పర్మిషన్‌లను అనుమతించమని కోరడం ద్వారా, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని యాప్‌లు సేకరిస్తాయి.
కొన్ని యాప్‌లు మాల్‌వేర్‌ను కలిగి ఉండి, ఫోన్‌లోని సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తాయని తెలిపారు. ఇవి వినియోగదారుల బ్యాంక్ ఖాతాలు, ఆధార్ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించేందుకు ఉపయోగపడతాయని పోలీసులు హెచ్చరించారు. అనుమతి లేని, RBI ఆమోదం లేని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయవద్దని, యాప్‌లకు అనవసరమైన పర్మిషన్‌లు ఇవ్వవద్దని సూచించారు. ఈ లోన్ యాప్‌లు అధిక వడ్డీ రేట్లతో లోన్‌లు అందించి, తిరిగి చెల్లించలేని వారిని బెదిరించడం, వేధించడం, వారి వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేయడం వంటి సంఘటనలు తెలంగాణలో గతంలో నమోదయ్యాయని అన్నారు.
ఇటువంటి మోసాల వల్ల బాధితులు ఆర్థికంగా, మానసికంగా నష్టపోయారని పోలీసులు తెలిపారు. ప్రజలు విశ్వసనీయ బ్యాంకులు నుండి మాత్రమే లోన్‌లు తీసుకోవాలని, ఏదైనా అనుమానాస్పద యాప్ లేదా లింక్‌పై క్లిక్ చేయమని సందేశాలు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 ను సంప్రదించాలని తెలంగాణ పోలీసులు సూచించారు.






