బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పేరిట ఫేక్ ప్రకటనలు నమ్మొద్దు : బాలకృష్ణ

by Muthe.Rajitha |

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి(Basavatarakam Cancer Hospital) పేరిట వస్తున్న ఫేక్ ప్రకటనలు నమ్మొద్దని నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రకటించారు.

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పేరిట ఫేక్ ప్రకటనలు నమ్మొద్దు : బాలకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్ : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి(Basavatarakam Cancer Hospital) పేరిట వస్తున్న ఫేక్ ప్రకటనలు నమ్మొద్దని నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రకటించారు. ఆసుపత్రి పేరుతో, నందమూరి బాలకృష్ణ పేరుతో 'బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్' పేరిట నకిలీ ప్రకటనలు(Fake Adds) ప్రచారం అవుతున్నాయని, వాటిని నమ్మి డబ్బులు మోసపోవద్దని ఓ హెచ్చరిక జారీ చేశారు. అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి "బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్" పేరుతో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళాల సేకరణ కోసం ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రచారంలో ఉందన్నారు.

ఈ కార్యక్రమానికి తన అనుమతి గాని, హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు అనుమతి గాని లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ ఈవెంట్ ను నమ్మి ఎవరూ డబ్బులు మోసపోవద్దని తెలిపారు. తమ హాస్పిటల్ కు పారదర్శక మార్గాల్లో విరాళాలు వస్తాయని తెలియజేశారు.

Next Story