- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chicken Safe : బర్డ్ ఫ్లూ భయం వద్దూ..చికెన్ తినడం సురక్షితం !
కోళ్ల పరిశ్రమదారులను తీవ్ర నష్టాల పాలుచేస్తూ..ప్రజలను చికెన్ తినకుండా భయపెడుతున్న బర్డ్ ఫ్లూ వైరస్ (Bird Flu Virus)దెబ్బకు తెలుగు రాష్ట్రాలలో చికెన్ అమ్మకాలు(Chicken Sales Down Fall)ఆకాశం నుంచి నేలకు పడిపోయినట్లయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : కోళ్ల పరిశ్రమదారులను తీవ్ర నష్టాల పాలుచేస్తూ..ప్రజలను చికెన్ తినకుండా భయపెడుతున్న బర్డ్ ఫ్లూ వైరస్ (Bird Flu Virus)దెబ్బకు తెలుగు రాష్ట్రాలలో చికెన్ అమ్మకాలు(Chicken Sales Down Fall)ఆకాశం నుంచి నేలకు పడిపోయినట్లయ్యాయి. ఇదే సమయంలో మటన్ కేజీ ధర ఏకంగా రూ.1100కు చేరుకుంది. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్, గుడ్ల అమ్మకాలు పడిపోవడంతో ప్రజల్లో చికెన్ పట్ల నెలకొన్న భయాలు పోగొట్టేందు(Overcoming The Fear Of Chicken)కు కోళ్ల పరిశ్రమల యజమానులు ఉచితంగా చికెన్ పంపిణీ చేస్తున్నారు.
ఎక్కడికక్కడా తమ ప్రాంతాల్లో ఫ్రీ చికెన్ మేళాలు(Free Chicken Melas) నిర్వహిస్తున్నారు. అదేంటోగాని ఫ్రీగా తినేందుకు భయపడని జనం చికెన్ కొనుగోలు చేసేందుకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనంలో చికెన్ పట్ల భయాన్ని పోగొట్టేందుకు ఫౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డీనేషన్ అసోసియేషన్ (Poultry Breeder Coordination Association)పత్రికల్లో, ప్రసార సాధనా(Media)ల్లో కీలక ప్రకటన(Key Announcement)జారీ చేసింది. చికెన్ తినడం సురక్షితం(Safe To Eat Chicken)అంటూ ప్రకటన విడుదల చేసింది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) ప్రకారం 70 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిలో చికెన్, గుడ్లు వండటంతో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నా చనిపోతుందని స్పష్టం చేసింది. మన భారత దేశంలో 100డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిలోనే చికెన్, గుడ్లు వండుతారని..అందువల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని...నిర్భయంగా చికెన్ ప్రియులు చికెన్, గుడ్లు తినవచ్చని పేర్కొంది. మరి డబ్ల్యుహెచ్ వో ప్రమాణాలను ఉటంకిస్తూ చికెన్ తినడం సురక్షితమని స్పష్టమవుతున్నందునా..ఇక చికెన్ తినడంలో సందేహాలు ఎందుకంటున్నారు చికెన్ ప్రియులు. మీరు కూడా ఈ ప్రకటనను విశ్వసిస్తే నిర్భయంగా చికెన్ తినవచ్చు మరి. ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే చికెన్ ధరలు బాగా దిగివచ్చాయి...వెళ్లి చౌకగా చికెన్ కొనుగోలు చేసి వండుకుని తినండంటున్నారు ఫౌల్ట్రీ అసోసియేషన్స్.
బర్డ్ ఫ్లూ భయాలు
బర్డ్ ఫ్లూ ఎక్కువగా కోళ్లు, టర్కీ కోళ్లు, బాతులకు వస్తుంది. ఈ వ్యాధి రావడానికి కారణం ఇన్‌ఫ్లూయెంజా ఏ వైరస్‌లు. వీటిలో చాలా రకాలున్నాయి. కామన్‌గా H5N1, H7N9, H5N8 స్టెయిన్ల వల్ల వ్యాధి రాగలదు. కొన్ని స్ట్రెయిన్లు మనుషులకు కూడా సోగలగవు. బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషులకు కూడా సోకే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి సోకిన ప్రాంతంలో.. కోళ్లు తిరిగిన ప్రదేశాల్లో ఏవైనా వస్తువుల్ని ముట్టుకుంటే.. అప్పుడు కూడా మనుషులకు ఇది సోకే ప్రమాదం ఉంటుంది. కోళ్ల వ్యర్థాల నుంచి గాలిలో వైరస్ విస్తరించవచ్చు. మనుషులకు ఈ వ్యాధి అరుదుగా సోకుతోంది.
బర్డ్ ఫ్లూ మనుషులకు సోకితే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కళ్లలో ఇన్ఫెక్షన్ వస్తుంది. వ్యాధి తీవ్రం అయితే, ఊపిరితిత్తులు నీటితో నిండిపోయి నిమోనియా వస్తుంది, ఊపిరి సరిగా తీసుకోలేరు. బ్రెయిన్, ఉపిరి తిత్తులు దెబ్బతినవచ్చు..అరుదుగా మరణాలు కూడా సంభవించవచ్చు. కోడిని సరిగా ఉడకబెట్టకపోయినా, కోడి గుడ్లను సరిగా వండకపోయినా వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉంటుంది. వైరస్ చనిపోవాలంటే.. కనీసం 70 డిగ్రీలకు పైగా సెల్సియస్‌లో వండాలంటున్నారు నిపుణులు.






