Schools: స్కూల్స్‌లో రాజకీయ పార్టీల వితరణలకు నో పర్మిషన్.. సర్కులర్ జారీ చేసిన అధికారులు

by Prasad Jukanti |   (  Updated:2025-07-23 11:16:05  IST  )

స్థానిక ఎన్నికల వేళ పాఠశాలల్లోకి రాజకీయ నాయకులను అనుమతి ఇవ్వొద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Schools: స్కూల్స్‌లో రాజకీయ పార్టీల వితరణలకు నో పర్మిషన్.. సర్కులర్ జారీ చేసిన అధికారులు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి/డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) సమీపిస్తున్న వేళ పాఠశాలల్లో విద్యార్థులపై రాజకీయ ప్రభావం చూపే కార్యక్రమాల పట్ల కఠిన వైఖరి అవలంభించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా తాజాగా పాఠశాలల్లో రాజకీయ ప్రచారానికి చెక్ పెట్టేలా జగిత్యాల డీఈవో (Jagityal DEO) కె.రాము కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు రాజకీయ నాయకులు అందించే పుస్తకాలు, పెన్నులు మొదలైన వాటిని పంపిణీ చేసేందుకు అనుమతులు ఇవ్వకూడదని ఆ జిల్లాలోని అన్ని మండలాల విద్యాధికారులు, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. కొందరు నాయకులు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో విద్యార్థులకు పెన్నులు,బ్యాగులు పుస్తకాలు ఇతరత్రా వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులను పాఠశాలలోకి అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనల ఉల్లంఘనకు అవకాశం ఇవ్వకూడదని, పాఠశాలలు సజావుగా పనిచేయడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు.

Next Story