ఈ ఘటనపై సీఎం వద్ద సమాధానం ఉందా..? మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్

by Ramesh Goud |

ఈ ఘటనపై ముఖ్యమంత్రి (Chief Minister) వద్ద ఏదైనా సమాధానం (Answer) ఉందా? అని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ప్రశ్నించారు.

ఈ ఘటనపై సీఎం వద్ద సమాధానం ఉందా..? మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఘటనపై ముఖ్యమంత్రి (Chief Minister) వద్ద ఏదైనా సమాధానం (Answer) ఉందా? అని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ప్రశ్నించారు. చిలుకూరు బాలాజీ (Chilkuru) ప్రధాన పూజారి రంగరాజన్ (Rangarajan)పై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై ట్విట్టర్ (Twitter) వేదికగా స్పందించిన ఆయన.. పలు సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. ఈ సందర్భంగా.. ధర్మరక్షకులు దాడులు చేస్తారని, రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారని అన్నారు. అలాగే చిల్కూరు ఆలయ ప్రధాన అర్చకుడు, గొప్ప పండితుడు రంగరాజన్‌పై రెండు రోజుల క్రితం (Two Days Back) ముష్కరుల దాడి జరిగిందని తెలిపారు.

అలాగే ఈ పిరికిపంద చర్యపై హిందూమత రక్షకుల నుండి ఒక్క మాట కూడా రాలేదని బీజేపీ (BJP)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేగాక దాడికి సంబంధించిన వీడియోలు (Videos) ఉన్నాయని, రెండు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఏమైనా చేసిందా? ఇది అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక హోం మంత్రి.. (Home Minister)?, ముఖ్యమంత్రి..? ఎవరివద్దనైనా సమాధానాలు ఉన్నాయా అని బీఆర్ఎస్ నేత (BRS Leader) నిలదీశారు. కాగా రెండు రోజుల క్రితం చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులపై కొందరు మూకలు దాడి చేశారు.

దీనిపై రంగరాజన్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ (Moinabad Police Station) లో ఫిర్యాదు (Complaint) చేశారు. రెండు రోజుల క్రితం ఇంట్లో ఉన్న సమయంలో కొంత మంది వచ్చి కొట్టారని, అడ్డుకునేందుకు వచ్చిన తన కుమారుడిపై కూడా దాడి చేశారని, ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయనను సంప్రదించగా.. వివరాలు చెప్పడానికి నిరాకరించారు. దీనిపై ఫిర్యాదు చేశానని, మిగతా వివరాలు విచారణలో తెలుస్తాయని వెల్లడించారు. దీనికి సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ.. ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

Next Story