KCR, రాహుల్ గాంధీకి ఆ దమ్ముందా.. రాజాసింగ్ సంచలన సవాల్

by Disha Web Desk 4 |
KCR, రాహుల్ గాంధీకి ఆ దమ్ముందా.. రాజాసింగ్ సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన సవాల్ విసిరారు. బీసీల పట్ల రాహుల్ గాంధీకి చిత్త శుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించే దమ్ముందా? అన్నారు. బీసీల పట్ల ప్రేమ ఒలకబోస్తున్న కేసీఆర్, కేటీఆర్‌లకు బీసీని సీఎం చేస్తామని ప్రకటించగలరా? అని సవాల్ విసిరారు. కనీసం సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు సీఎం పదవి చేపట్టబోమని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అర్హులైన నాయకులను సీఎం చేసే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఓబీసీ నేతను బీజేపీ ప్రధాని చేసిందని గుర్తు చేశారు. మైనార్టీ, దళిత, గిరిజన నేతలను రాష్ట్రపతిలను చేసిన చరిత్ర బీజేపీదన్నారు. తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకుని ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed