- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జై శ్రీరాం అంటే పై నుండి డబ్బులు పడతాయా?.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు మీటంగ్‍లు పెట్టడం జై శ్రీరాం అనడమే పనిగా పెట్టుకున్నారని.. జై శ్రీరాం అంటే పైనుండి పైసలు పడుతున్నాయా? పథకాలు వస్తున్నాయా? అని ప్రశ్నించారు. మోడీని తీసుకువచ్చి ఓ మీటింగ్ పెట్టించి హిందీలో నాలుగు మాటలు మాట్లాడించి తిరిగి పంపించివేస్తారన్నారు. ఇక్కడ ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమీ మాట్లాడరని రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించే ప్రయత్నం కూడా చేయరన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ఇక్కడి బీజేపీ నేతలు నోరుమూసుకుని మౌనంగా కూర్చుంటారని ద్వజమెత్తారు. ఇవాళ హనుమకొండలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో పాల్గొని మాట్లాడిన కొండా సురేఖ.. గోదావరి పుష్కరాల కోసం పక్కన ఉన్న ఏపీకి కోట్లాది రూపాయలు కేంద్రం విడుదల చేస్తే తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.4200 కేటాయించి ఇందులో నుంచి రూ. 1400 కోట్లు విడుదల చేశారన్నారు. భద్రాచలం, వేములవాడ, బాసర వంటి నాలుగు ఆలయాలను అభివృద్ధి చేయిస్తున్నారన్నారు.
ఓర్వడం లేదు:
బీఆర్ఎస్ కళ్లు ఉండి చూడని, చెవులు ఉండి వినలేని పార్టీ అని కొండా సురేఖ విమర్శించారు. రైతుల కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని వారు అధికారంలో ఉన్న పదేళ్లలో రైతులుకు ఏం చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. రైతులకు వ్యతిరేకంగా మూడు నల్లచట్టాలను బీజేపీ తీసుకువస్తే వాటికి బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉండటాన్ని బీఆర్ఎస్ ఓర్చుకోవడం లేదన్నారు. పదేళ్ల ఇచ్చిన హామీలు నెరవేర్చని బీఆర్ఎస్ మేమిచ్చిన హామీలపై ప్రశ్నిస్తోందన్నారు. ప్రజలకు విద్యా, ఆరోగ్యం, సంక్షేమం కోసం నిరంతరం సీఎం రేవంత్ రెడ్డి పాలన చేస్తుంటే ఓర్వలేక చాలా మాటలు మాట్లాడుతున్నారన్నారన్నారు.






