- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉచిత బస్సు పథకం రద్దు చేస్తామని ప్రకటించే దమ్ము ఉందా? కేసీఆర్‌కు మంత్రి సీతక్క సూటి ప్రశ్న
ఫ్రీ బస్ పథకాన్ని పనికిమాలినదిగా అభివర్ణించడం దొరతనానికి నిదర్శనమని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫ్రీ బస్ పథకాన్ని పనికిమాలినదిగా అభివర్ణించడం దొరతనానికి నిదర్శనమని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఉచిత బస్ ప్రయాణ పథకంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, మహిళా లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అన్నారు. నిజంగా ఈ పథకం పనికిరాదని భావిస్తే, దాన్ని రద్దు చేస్తామని చెప్పే ధైర్యం ఉందా సూటి ప్రశ్న వేశారు. ఈ ఉచిత బస్ పథకం ద్వారా లక్షలాది మహిళలు ప్రతి రోజు ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకుంటూ, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సేవలు సులభంగా పొందుతున్నారని ఆమె వివరించారు.
ఇప్పటివరకు సుమారు రూ.10 వేల కోట్ల మేర మహిళలకు ప్రయాణ వ్యయభారం తగ్గిందని తెలిపారు. ఇది కేవలం పథకం మాత్రమే కాదు, మహిళల ఆర్థిక స్వావలంబనకు, సామాజిక స్వేచ్ఛకు దారితీసే కీలక అడుగు అని స్పష్టం చేశారు. సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న ఈ పథకాన్ని ఓర్వలేక, దాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతోందని మంత్రి ఫైర్ అయ్యారు. మహిళలు బయటకు రావడం, తమ పనులు స్వయంగా చేసుకోవడం ఇష్టపడని దోరతనపు ఆలోచనల వల్లే ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయని అన్నారు.






