- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విగ్రహాన్ని శుభ్రం చేస్తే చిత్తశుద్ది ఉన్నట్టేనా..? కేంద్రమంత్రిపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
విగ్రహం శుభ్రం చేస్తే అంబేద్కర్ పై చిత్త శుద్ది ఉన్నట్టేనా? కేంద్రమంత్రి చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Congress MP Chamala Kiran Kumar Reddy) ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: విగ్రహం శుభ్రం చేస్తే అంబేద్కర్ పై చిత్త శుద్ది ఉన్నట్టేనా? కేంద్రమంత్రి చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Congress MP Chamala Kiran Kumar Reddy) ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ లో వీడియో విడుదల చేసిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఈ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేస్తూ.. పూల మాల వేసి నివాళులు అర్పించారు.
రేపు అంబేద్కర్ జయంతి (Ambedkar Birth Anniversary) ఉంటే ఈ రోజే నివాళులు (tribute) అర్పించి ఆయనకే అంబేద్కర్ పై చిత్తశుద్ది ఉన్నట్టు, ఆయనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నట్లు, ఆయనే అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్టు, బీజేపీ (BJP) అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నట్టు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అవమానించిన కేంద్రమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) ఈ రోజు వరకు ఎందుకు సమాధానం చేప్పలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) దేశవ్యాప్తంగా జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టిందని, దీంతో ఎవరికి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే పట్టుదల ఉందో ప్రజలకు అర్థమైపోతుందని అన్నారు. మీరు ఒకరోజు ముందు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించినంత మాత్రాన డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలు పాటించినట్టు కాదని చెప్పారు. బీజేపీ వాళ్లు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అవమానించిందని దేశ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, కానీ రాజ్యాంగాన్ని రాసే విధంగా అంబేద్కర్ ని చైర్మన్ చైసిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు.
అట్టడుగు వర్గాలకు అన్యాయం జరిగిందని, చదువుకున్న ఓ దళితుడిని ముందు పెట్టాలనే ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. నెహ్రూ (Nehru) ప్రధానిగా ఉన్న సమయంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం విశ్వసిస్తున్నామని, దానిని గత పదేళ్లుగా అధికారంలో ఉన్న మీరు మీ ఇష్టానుసారంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో ఉన్న సెక్యూలర్ పదాన్ని కూనీ చేసే ప్రయత్నం చేస్తున్న మీరు ఇలాంటి డ్రామాలు చేయొద్దని ఎంపీ చామల సూచించారు.






