HYD: మెట్రో రైలులో గుండెను తరలించిన వైద్యులు

by Gantepaka Srikanth |

హైదరాబాద్ మెట్రో(Hyderabad metro train)లో వైద్యులు గుండెను తరలించారు.

HYD: మెట్రో రైలులో గుండెను తరలించిన వైద్యులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో(Hyderabad metro train)లో వైద్యులు గుండెను తరలించారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి(LB Nagar Kamineni Hospital) నుంచి లక్డీకపూల్ గ్లోబల్ ఆసుపత్రి(Lakdikapul Global Hospital)కి తీసుకొచ్చారు. మనిషి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన వైద్యులకు సంపూర్ణంగా సహకరించిన మెట్రో యాజమాన్యాన్ని నగరవాసులు అభినందిస్తున్నారు. సాధారణంగా మనిషి అవయువాల్ని అంబులెన్స్‌లో, ఫ్లైట్స్‌లో తరలిస్తుంటారు. అయితే నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్‌ నేపథ్యంలో గుండె తరలింపునకు వైద్యులు హైదరాబాద్‌ను మెట్రోను ఎంచుకున్నారు. ఈ మేరకు మెట్రో అధికారులతో సంప్రదింపులు జరిపారు. మెట్రో సిబ్బంది కూడా ముందుకు రావడంతో మెట్రోలో గుండెను తరలించారు. మెట్రో రైలు అధికారులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఈ ఏర్పాట్లు చేశారు.

Next Story