- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ పోలీసులు నన్నెలా అరెస్ట్ చేస్తారు..సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రత
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో అయితే తెలంగాణ పోలీసులు తనను ఎలా అరెస్ట్ చేస్తారని సికింద్రాబాద్ కోర్టులో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రత బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. 35 ఏళ్ల అనుభవం ఉన్న తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. ఇన్ని సంవత్సరాల నుండి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని, నేరం ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగితే తెలంగాణ పోలీసులు ఎలా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తారని పిటిషన్‌లో ప్రశ్నించింది.
ఇదిలా ఉంటే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో తనిఖీలు చేసిన అధికారులు సంచలన విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఓ జంటకు సరోగసి పేరుతో బిడ్డను అమ్మగా చిన్నారికి డీఎన్ఏ టెస్ట్‌లో తల్లిదండ్రుల డీఎన్ఏ మ్యాచ్ అవ్వకపోవడంతో కేసు నమోదు చేశారు. ఆ తరవాత విచారణ జరిపిన అధికారులు పిల్లల అక్రమ రవాణాతో పాటు, బిచ్చగాళ్ల నుండి వీర్యం సేకరించడం, రోజువారి కూలీల నుండి అండాలను సేకరించడం ఇలా అనేక విషయాలను వెల్లడించారు. దీంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.






