పెట్టుబడులు రాకుండా చేయాలనుకుంటున్నారా? బీఆర్ఎస్‌ను నిలదీసిన శ్రీధర్ బాబు

by Ramesh Naini |

ఫ్యూచర్ సిటీపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ ​రావు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.

పెట్టుబడులు రాకుండా చేయాలనుకుంటున్నారా? బీఆర్ఎస్‌ను నిలదీసిన శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫ్యూచర్ సిటీపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌​రావు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. శనివారం సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరీశ్‌రావు అమెరికా పోయిన పగటి కలలు కంటున్నారని, అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అనడం ఆయన బాధ్యత రాహిత్యాన్ని తెలియజేస్తోందని మంత్రి ఫైర్ అయ్యారు. హరీశ్‌రావు ప్రకటన తెలంగాణకి అన్యాయం చేస్తున్నట్లు కనిపిస్తుందని, తెలంగాణకు పెట్టుబడులు అడ్డుకోవడంతో పాటు తెలంగాణ యువతకు అన్యాయం చేసి ఉద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా? అని శ్రీధర్ బాబు నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధి కావాలని మీకు, మీ పార్టీకి ఉందా?, రాష్ట్ర అభివృద్ధి పైన మీ వైఖరి ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ కి స్వార్ధ రాజకీయాలే వాళ్లకు ముఖ్యమని, ఆ పార్టీ తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి రాష్ట్ర అభివృద్దిని అడ్డుకోవాలని ముందుకు పోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని, మీ రాజకీయల కోసం సంస్థలను పక్క రాష్ట్రాలకు పంపించడం ఎంతవరకు సమంజసమని, బీఆర్ఎస్ వి బ్లాక్ మెయిల్ రాజాకీయాలని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలనే ఎజెండా పెట్టుకున్నారని, అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన ఇంకా బుద్ధి మారట్లేదని, ఓటమి నిరాశ నుండి ఇంకా తెరుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంట నగరాల ప్రజల ను దృష్టిలో పెట్టుకొని మెట్రోను అభివృద్ధి చేస్తా అంటే అడ్డుకుంటున్నారని, చార్మినార్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ చేస్తా అంటే వద్దు అంటున్నారని శ్రీధర్ బాబు విమర్శించారు. భారత్ ఫ్యూచర్ సిటీ కాలుష్య కర్మాగారాలు రావొద్దు అని ప్రజలు కోరుకుంటున్నారని, ఫ్యూచర్ సిటీలో ప్రజలు ఎలా కోరుకుంటుంన్నారో అలాగే జరుగుతుందని, యువతకు బంగారు భవిష్యత్తు కోసమే ఫుచర్ సిటీ నిర్మాణాన్ని ప్రభుత్వం తల పెట్టిందన్నారు. భావి తరాల కోసం భారత ఫ్యూచర్ సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందని, కాలుష్యం లేని పరిశ్రమలు, గ్రీన్ ఫార్మాకు తాము కట్టుబడి ఉన్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలు రాష్ట్ర ప్రజలు సహించరని, అధికారం లేదని ఓర్వలేక రాక్షసుల మాదిరిగా తయారై అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

బీజేపీతో కలసి అడ్డుకోవాలని చూస్తోంది

మూసీ నది ప్రక్షాళనను బీజేపీతో కలిసి అడ్డుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. మూసీ నది ప్రక్షాళన జంట నగరాలకు వరమని, ఆ నది ప్రక్షాళన సమయంలో పేదవాడికి నష్టం జరిగితే న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి చెప్పారు. మూసీ నది నీటిని పరిశుద్ధం చేయాల్సిన అవసరం ఉందా లేదా? కేబీఆర్ పార్క్ దగ్గర అండర్ గ్రౌండ్ రోడ్లను ఏర్పాటు చేస్తుంటే అడ్డుకుంటున్నారని, ప్రజలు కోరుతున్నదే తాము, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సిటీని ఏర్పాటు చేయాలని చూస్తున్నామని, వాటిని అడ్డుకుంటున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి మైగ్రేషన్ దృష్టిలో పెట్టుకొని త్రాగునీరు, రోడ్లు, ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా తెలంగాణ యువతకు అన్యాయం చేయకూదడని, మీరు ప్రభుత్వం లో ఉండి యువతకు అన్యాయం చేశారు.. ప్రతిపక్షంలో ఉండి కూడా అన్యాయం చేయకండి అని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేస్తారా? హరీశ్ రావు చెప్పాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

Next Story