Largest Crocodile : ప్రపంచంలోనే అతిపెద్ద మొసలి..ఎక్కడుందో తెలుసా ?

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-19 06:15:00  IST  )

జల చరాల్లో మొసళ్లు (Crocodile)ప్రత్యేకమైనవి. వాటిలో రకరకాల జాతులు ఉన్నాయి. కొన్ని భారీ ఆకారంతో పెరిగితే మరికొన్నిటికి తల, తోక భాగాల్లో తేడాలుంటాయి.

Largest Crocodile : ప్రపంచంలోనే అతిపెద్ద మొసలి..ఎక్కడుందో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : జల చరాల్లో మొసళ్లు (Crocodile)ప్రత్యేకమైనవి. వాటిలో రకరకాల జాతులు ఉన్నాయి. కొన్ని భారీ ఆకారంతో పెరిగితే మరికొన్నిటికి తల, తోక భాగాల్లో తేడాలుంటాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద మొసలి(World's Largest Crocodile) ఎక్కడుందన్న వివరాలు పరిశీలిస్తే..దాని వివరాలు తెలుసుకోవాలన్న కుతుహాలం అందరిలోనూ తలెత్తకమానదు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మొసలి దక్షిణాఫ్రికా(South Africa)లో ఉంది. దాని పేరు హెన్రీ(Henry). వయసు ఏకంగా 124ఏళ్లు. 1900సంవత్సరంలో జన్మించిన ఈ మొసలిని 1903లో పట్టుకున్నారు.

అప్పటి నుంచీ మనుషుల రక్షణలోనే పెరుగుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని జంతు సంరక్షణ కేంద్రంలో దీన్ని పెంచుతున్నారు. ఈ మొసలికి ఆరుగురు భార్యలు, పదివేలమందికంటే ఎక్కువ సంతానం కలిగి ఉండటం విశేషం. ఇంత వయసున్నప్పటికి ఈ మొసలి ఇంకా ఆరోగ్యంగానే ఉందని, ఇంకా చాలా ఏళ్లు బతుకుతుందని జంతు సంరక్షణ కేంద్ర నిర్వాహకులు చెబుతున్నారు. 700 కిలోలకు పైగా బరువు 17 అడుగుల పొడవున్న నైల్ మొసలి హెన్రీ ప్రపంచంలోనే అత్యంత పురాతన మొసలిగా పేరుగాంచింది. ఒకప్పుడు నైలు నది ఒడ్డున ఈ జాతికి చెందిన క్రూరమైన మొసళ్లు కనిపించేవి. ఈ జాతి మొసళ్లను నైలు అని పిలిచేవారు. సహారా ఎడారి పక్కనే ఉన్న 26 దేశాల్లో ఈ మొసలి కనిపిస్తుంది.

ఈ మొసలి జాతి ప్రకృతిలో భయంకరమైన జీవుల్లో ఒకటిగా పరిగణింపబడుతోంది. ఈ మొసలి జాతులు సరస్సులు, నదులు, చిత్తడి నేలలతో సహా వివిధ జల వాతావరణాలలో నివసిస్తాయి. ఈ ప్రత్యేక నైలు జాతి మొసలి తరచుగా జీబ్రాలు, పోర్కుపైన్స్ వంటి జంతువులను వేటాడుతుంది. అయితే ఈ భయంకరమైన మొసళ్ల వల్ల ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే హెన్రీ మొసలి బోట్స్వానాలోని ఒవాకాంగో డెల్టాలో స్థానిక గిరిజనులను వేటాడి నరమాంస భక్షకురాలిగా మారింది. ఈ మొసలిని అవసరమైతే చంపేయమని స్థానిక ప్రభుత్వం ఆదేశాలివ్వగా 1903లో ప్రసిద్ధ వేటగాడు సర్ హెన్రీ న్యూమాన్ ఈ భారీ మొసలిని చంపకుండా సజీవంగా పట్టుకున్నాడు.

వేటగాడు హెన్రీ న్యూమాన్ పేరు మీదుగా ఈ మొసలికి 'హెన్రీ' అని పేరు పెట్టారు. హెన్రీ కంటే పెద్ధదైన మొసలి కాసియస్ అస్ర్టేలియాలోని జంతు సంరక్షణ కేంద్రంలో ఉండేది. 18అడుగుల పొడవు ..టన్ను బరువు ఉన్న కాసియస్ 110ఏళ్లకు పైగా జీవించి 2024నవంబర్ లో చనిపోయింది. కాసియస్ మరణాంతరం హెన్రీ ప్రపంచంలోనే అతిపెద్ధ మొసలిగా చలామణి అవుతోంది.

Next Story