KTR: మిస్టర్ రాహుల్.. మీ సీఎం ఏమి చేస్తున్నారో మీకు తెలుసా? కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కేసును సీబీఐకి అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR: మిస్టర్ రాహుల్.. మీ సీఎం ఏమి చేస్తున్నారో మీకు తెలుసా? కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Kaleshwaram project) కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కేసును (CBI) సీబీఐకి అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)కి ట్యాగ్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘సీబీఐ అంటే బీజేపీ 'ప్రతిపక్షాల నిర్మూలన సెల్' అని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును అదే సీబీఐకి అప్పగిస్తున్నారు. మిస్టర్ రాహుల్ గాంధీ.. మీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో మీకు తెలుసా? మీరు ఎన్ని కుట్రలు పన్నినా, మేము చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతాం. న్యాయవ్యవస్థపై, ప్రజలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. సత్యమేవ జయతే’ అని ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో సీబీఐ, ఐటీ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను విమర్శలు చేస్తూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఫోటోను ట్యాగ్ చేసి కేటీఆర్ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Next Story