ఏం తమాషాగా ఉందా రాకేశ్ రెడ్డి..! అసెంబ్లీలో మంత్రుల ఉగ్రరూపం

by Kema Shiva Kumar |

తెలంగాణ అసెంబ్లీలో ఇప్ప సారా అంశంపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఏం తమాషాగా ఉందా రాకేశ్ రెడ్డి..! అసెంబ్లీలో మంత్రుల ఉగ్రరూపం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) ‘ఇప్ప పుప్పు సారా’పై తన వెర్షన్ వినిపించగా, అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల తూటాల పేలాయి. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి (Rakesh Reddy) మాట్లాడుతూ.. ఇప్ప సారా అంశం ప్రభుత్వానికి నవ్వులాటగా ఉందని, ఆ ఉత్పత్తి ద్వారా 130 దేశాల్లో ఆదాయం (Revenue) వస్తుందంటూ అనిరుధ్ రెడ్డి చేసిన ప్రసంగంపై సెటైర్లు వేశారు. ఒకవేళ ప్రభుత్వం ఇప్ప సారా తయారు చేస్తే, దానికి ‘ఇందిరమ్మ’ పేరు మాత్రం పెట్టవద్దని కామెంట్ చేశారు.

అయితే, రాకేశ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం తమాషాగా ఉందా రాకేశ్ రెడ్డి..’ అంటూ మండిపడ్డారు. సారా అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు సభలో ఇందిరమ్మ పేరు తీసినందుకు రాకేశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇప్ప పువ్వు సారా అంశంలో ఇందిరమ్మ పేరు ఎత్తడం మహిళా లోకాన్ని అవమానించడమేనని అన్నారు.

మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆయన క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇందిరమ్మ పేరుపై గంటకు పైగా సభా సమయం వృథా చేయడం సరికాదన్నారు. సభ్యుడు తప్పుగా మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.

Next Story