- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయాలు నాకు గుర్తులేవు!.. చార్జ్ షీట్ లో కవిత సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సంచలన ఆరోపణలు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు 49 మందిని విచారించిన ఈడీ 18 మందిని అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు 1100 కోట్ల నేరం జరిగిందని చార్జ్ షీట్ లో పేర్కొన్న ఈడీ.. ఇందులో 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందగా.. మరో 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయని తెలిపింది. ఈ కేసులో కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిందని, 292 కోట్ల నేరం లో కవిత పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. అలాగే ఈ కేసులో కవిత సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసిందని, బుచ్చిబాబు కవిత పాత్ర పై వాంగ్మూలం ఇవ్వగా.. ఆ తర్వాత కవితకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకోవాలని కవిత బుచ్చిబాబుపై ఒత్తిడి చేసిందని ఈడీ పేర్కొంది. అంతేగాక అరుణ్ రామ్ చంద్ర పిళ్లయి ఇచ్చిన స్టేట్మెంట్లను కవిత ఒత్తిడి మేరకే వెనక్కి తీసుకునేందుకు రిట్రాక్ట్ పిటిషన్ వేశారని కోర్టుకు ఈడీ తెలిపింది.
ఇక ఈ కేసుకు సంబందించి ఈడీ చార్జి షీట్ లో కవిత లిక్కర్ పాలసీ రూపకల్పనలో నా తరపున పాల్గొనాలని బుచ్చిబాబుకి నేను ఎలాంటి అథరైజేషన్ ఇవ్వలేదని, ఇండో స్పిరిట్ లో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ నాకు ఎలాంటి వాటాలు లేవని తెలిపింది. అలాగే ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి నేను ఎవరితో మాట్లాడలేదని, బుచ్చిబాబు, రాఘవల మధ్య జరిగిన సంభాషణలు చూపిస్తే నాకు గుర్తులేదని, వాళ్ళ నెంబర్లు కూడా తెలియదని చెప్పుకొచ్చింది. ఇక లిక్కర్ పాలసీ రూపకల్పన, లిక్కర్ వ్యాపారం నాకు సంబంధం లేదని పేర్కొంది. నా తరపున ఎవరు ఆప్ ను సంప్రదించలేదని, లంచాలు ఇవ్వలేద. అరుణ్ పిళ్ళై నా ఫామిలీ ఫ్రెండ్ కావడంతో వికేండ్లలో తరచు కలుస్తుంటామని తెలిపింది. అరుణ్ పిళ్ళై ఇచ్చిన స్టేట్మెంట్ లను కవిత నిరాకరించిన కవిత.. అరుణ్ పిళ్ళై, సమీర్ మహేంద్రును హైదరాబాద్ లో కవిత కు పరిచయం చేశాడని, కవిత సమీర్ మహేంద్రు తో మాట్లాడిన విషయం గుర్తు లేదని చెప్పింది.
ఇండో స్పిరిట్ లో అరుణ్ పిళ్ళై నా తరపున కార్యకలాపాలు నిర్వహించలేదని తెలిపింది. ఇండియా హెడ్ న్యూస్ ఛానల్ లో అభిషేక్ కు వాటాలు ఉన్న సంగతి నాకు తెలియదని, ఇండియా హెడ్ ఛానల్ లో పెట్టుబడులు పెట్టాలని గౌతమ్ ముత్త నన్ను కోరినా ఇంట్రస్ట్ లేదని చెప్పినట్లు తెలిపింది. ఇక మాగుంట శ్రీనివాస్ రెడ్డి అనేక సందర్భాలలో కలిశాను, కానీ మాగుంట రఘువరెడ్డిని ఒక్కసారి మాత్రమే కలిశానని చార్జ్ షీట్ లో పేర్కొంది. ఇక ఈ కేసులో కవిత జ్యూడిషియల్ రిమాండ్ ను రౌస్ అవెన్యూ కోర్టు మరో సారి పోడిగించింది. ఈడీ కేసులో కవితకు జూలై 3 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించగా. సీబీఐ కేసులో జూన్ 7 వరకు పొడిగించింది. జూన్ 7న సీబీఐ మరోసారి చార్జ్ షీట్ దాఖలు చేయనుంది.






