సీనియారిటి ప్రకారం డీఎమ్​హెచ్​వోలు ఇవ్వాలి

by samatah |

దిశ, తెలంగాణ బ్యూరో : సివిల్​సర్జన్​లకు ప్రమోషన్లు ఇస్తూ..కొత్తగా ఏర్పాటు చేసిన డీఎమ్​హెచ్​వో పోస్టులను సీనియారిటీ ప్రకారం భర్తీ చేయాలని పబ్లిక్​హెల్త్ డాక్టర్స్​అసోసియేషన్​మం

సీనియారిటి ప్రకారం డీఎమ్​హెచ్​వోలు ఇవ్వాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో : సివిల్​సర్జన్​లకు ప్రమోషన్లు ఇస్తూ..కొత్తగా ఏర్పాటు చేసిన డీఎమ్​హెచ్​వో పోస్టులను సీనియారిటీ ప్రకారం భర్తీ చేయాలని పబ్లిక్​హెల్త్ డాక్టర్స్​అసోసియేషన్​మంత్రి హరీష్​రావును కోరింది.ఈ మేరకు ఆదివారం మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పబ్లిక్​హెల్త్​డాక్టర్స్​అసోసియేషన్​అధ్యక్షుడు డాక్టర్​కత్తి జనార్ధన్​మాట్లాడుతూ..రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొత్త డీఎమ్​హెచ్​వో పోస్టులు, 40 నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో పనిచేస్తున్న వైద్యులందరికీ సీఏఎస్​ క్యాడర్ తో పాటుగా,డీసీఎస్​, సీఎస్ క్యాడర్ లకు కూడా మంజూరు చేయాలన్నారు.పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ కెరియర్ అడ్వాన్స్మెంట్ కొరకు టైమ్ అండ్ ప్రమోషన్లను కల్పించాలన్నారు. అధికారిక మీటింగులలో డాక్టర్లకు ప్రోటోకాల్ అమలు పరచాలన్నారు.పల్లె దావాఖాన లలో పనిచేస్తున్న ఎంబీబీఎస్ డాక్టర్లకు రూ. 52 వేల వేతనాన్ని మంజూరు చేయాలన్నారు. ఇక కాంట్రాక్ట్ లో పనిచేస్తూ...రెగ్యులర్ కాని వైద్య సిబ్బందికి పర్మినెంట్ రిక్రూట్మెంట్లలో డాక్టర్ల నియామకాల తరహాలో ప్రాధాన్యత నివ్వాలన్నారు. సెకండ్ ఏఎన్​ఎంలకు ఏడు నెలల ఏరియర్స్​ ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ లలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి రెగ్యులర్ ఎంప్లాయ్ తరహాలో ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కారుణ్య నియామకాల కోటా అమలు చేయాలన్నారు. హెల్త్ స్కీమ్​ను అమలు చేయాలని కత్తి జనార్ధన్​ కోరారు.

Next Story