డాక్టర్ వాట్సాప్ వైద్యంతో కవలలు మృతి.. హాస్పిటల్ సీజ్ చేసిన DMHO

by Gantepaka Srikanth |

రంగారెడ్డి(Rangareddy) జిల్లా ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) విజయలక్ష్మి ఆసుపత్రి(Vijayalakshmi Hospital)పై ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.

డాక్టర్ వాట్సాప్ వైద్యంతో కవలలు మృతి.. హాస్పిటల్ సీజ్ చేసిన DMHO
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి(Rangareddy) జిల్లా ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) విజయలక్ష్మి ఆసుపత్రి(Vijayalakshmi Hospital)పై ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కవలల మృతి విషయం తెలిసిన వెంటనే జిల్లా వైద్యాధికారి రంగంలోకి దిగారు. సోమవారం సాయంత్రం ఆసుపత్రి వద్దకు వెళ్లి తనిఖీలు చేశారు. అనంతరం ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు DMHO వెంకటేశ్వర రావు ప్రకటించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కవలలు మృతిచెందారని బంధువులు ఆందోళన చేస్తున్నారు. వారితో డీఎంహెచ్‌వో మాట్లాడారు. ఆసుపత్రిలో రోగులను 108 ద్వారా నగరంలోని ఇతర ఆసుపత్రులకు తరలించారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ గర్భిణి(Pregnant) పురిటి నొప్పులతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రికి వచ్చింది. ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేరు. నొప్పులు మరింత తీవ్రతరం కావడంతో నర్సులు వాట్సాప్‌లో డాక్టర్‌కు వీడియో కాల్ చేశారు. డాక్టర్ సూచనల మేరకు నర్సులు గర్భిణికి ఆపరేషన్ చేశారు. వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావం అయింది. ఆ కొద్ది సేపటికే కవలలు మృతిచెందారు.

Next Story