- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరులో డీకే శివకుమార్ ప్రమాణ వేడుక.. తెలంగాణ నేతల సందడి
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం లోక్ భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ శివకుమార్‌తో ప్రమాణం చేయించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం లోక్ భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ శివకుమార్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ సీఎం సిద్దరామయ్య తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. కాగా, ప్రమాణస్వీకారానికి ముందు డీకే శివకుమార్ రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డీకే శివకుమార్ ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేరళ సీఎం సతీషన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖులు సైతం హాజరయ్యారు.






