ఆ బాధ్యత మా మీదే ఉంది.. DK అరుణ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

వక్ఫ్‌(Waqf Act)పై అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే చట్టం తెచ్చినట్లు తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేత, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(DK Aruna) స్పష్టం చేశారు.

ఆ బాధ్యత మా మీదే ఉంది.. DK అరుణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వక్ఫ్‌(Waqf Act)పై అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే చట్టం తెచ్చినట్లు తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేత, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(DK Aruna) స్పష్టం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లో జేపీసీ పర్యటించిందని తెలిపారు. పేద ముస్లింలకు లబ్ధి చేకూరడమే వక్ఫ్ చట్టం లక్ష్యమన్నారు. కొందరు కావాలనే వక్ఫ్‌పై అసత్యం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొందరి చేతుల్లోనే వక్ఫ్ భూములు ఉన్నాయని.. అవన్నీ దేశంలోని ముస్లింలందరికీ దక్కాలని ఆకాంక్షించారు. రోజురోజుకూ దేశంలో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతోందని అన్నారు. ప్రాంతీయ పార్టీగా రూపాంతరం చెందుతోందని విమర్శించారు. వక్ఫ్ సవరణ చట్టంపై ప్రజలకు అవకగాహన కల్పిస్తామని, ఆ బాధ్యత తమదే అని తెలిపారు.

ఇదిలా ఉండగా.. వక్ఫ్‌ (సవరణ) చట్టం చేసినందుకు ప్రధాని మోడీకి దావూదీ బొహ్రా ముస్లింలు ధన్యవాదాలు తెలిపారు. సవరణ చట్టంలో తమ డిమాండ్లను పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తంచేశారు. వీరు ఇటీవల ప్రధానిని కలిశారు. షియా ముస్లింలలో దావూదీ బొహ్రాలు జనాభాపరంగా మైనారిటీలు. ఆర్థికంగా వీరు బలమైన వర్గం. వక్ఫ్‌ బిల్లుపై ఏర్పడిన పార్లమెంటరీ సంయుక్త కమిటీకి గతంలో దావూదీ బొహ్రాలు తమ సిఫారసులను సమర్పించారు. వీటి ఆధారంగా చట్టంలో ప్రభుత్వం కొన్ని సవరణలను చేసింది.

Next Story