DK Aruna: అయ్యా.. హరీశ్‌రావు సమాధానం చెప్పు: నిప్పులు చెరిగిన ఎంపీ డీకే అరుణ

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-07 06:45:34  IST  )

కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ (BJP)పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) ఆరోపించారు.

DK Aruna: అయ్యా.. హరీశ్‌రావు సమాధానం చెప్పు: నిప్పులు చెరిగిన ఎంపీ డీకే అరుణ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ (BJP)పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) ఆరోపించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. యూరియాపై రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిసోందని ఆరోపించారు. వారి చేతగానితనాన్ని కేంద్ర ప్రభుత్వం నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి 9.5 టన్నుల యూరియా అవసరం ఉంటే.. 12.02 లక్షల టన్నుల యూరియాను కేంద్రం ఇప్పటికే పంపిందని తెలిపారు. ఇంకా 3 లక్షల టన్నుల అదనపు యూరియా ఉన్నా.. ప్రభుత్వం ఇలా కృత్రిమ కొరత సృష్టించడం దేనికి సంకేతమని ధ్వజమెత్తారు. రైతులకు పంచుతున్నారా.. లేక బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్నారా అని ప్రశ్నించారు. కనీస ముందుచూపు లేకుండా రాష్ట్రానికి ఎంత యూరియా కావాలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపకుండా తాత్సారం చేశారని ఇది.. సర్కార్ నిర్లక్ష్యం కాదా అని డీకే అరుణ ఆక్షేపించారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎలా పూర్తైంది..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharla) లింక్ ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని డీకే అరుణ ఫైర్ అయ్యారు. గతంలో చేసిన పొరపాట్లను బీఆర్ఎస్ పార్టీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు బనకచర్ల ప్రాజెక్ట్ నిలపుదల క్రెడిట్‌ను కొట్టేసేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో బీజేపీ ఎంపీలం పాల్గొని బనచచర్ల ప్రాజెక్ట్‌కు తాము వ్యతిరేకమనే క్లియర్ స్టాండ్ తీసుకుందని అన్నారు. నిత్యం బనచచర్ల ఇష్యూపై మాట్లాడుతున్న హరీశ్ రావు (Harish Rao).. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో మీరు సహకరించకపోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (Rayalaseema Lift Irrigation) ఎలా పూర్తి అయ్యాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీతో పాటు భారత ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తోందని డీకే అరుణ అన్నారు.

Next Story