DK Aruna: ప్రధానితో పెట్టుకున్నోళ్లు ఏమయ్యారో చూస్కో.. సీఎం రేవంత్‌పై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్‌ (Telangana Politics)లో దుమారాన్ని రేపుతున్నాయి.

DK Aruna: ప్రధానితో పెట్టుకున్నోళ్లు ఏమయ్యారో చూస్కో.. సీఎం రేవంత్‌పై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్‌ (Telangana Politics)లో దుమారాన్ని రేపుతున్నాయి. శుక్రవారం గాంధీ భవన్‌ (Gandhi Bhavan)లో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) బీసీ కాదని.. ఆయనో కన్వర్టెడ్ బీసీ’ అంటూ కామెంట్ చేశారు. 2002 వరకు ఉన్నత వర్గాల్లో మోడీ ఉండేవారని.. ఆయన సీఎం అయ్యాక తన కులాన్ని బీసీల్లో కలిపారని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని కులం గురించి ఆషామాషీగా చెప్పడం లేదని అన్నారు. పూర్తి ఎంక్వైరీ చేశాకే మాట్లాడుతున్నానని సీఎం రేవంత్ (CM Revanth) అన్నారు.

అయితే, తాజాగా సీఎం వ్యాఖ్యలపై మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) కౌంటర్ ఇచ్చారు. అసలు మోడీ కుటుంబం గురించి మాట్లాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎవరని మండిపడ్డారు. అసలు ఆయనకు ఏం అర్హత ఉందని ప్రధానిపై కామెంట్ చేశాని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కాకపోతే రేవంత్‌ను ఎవరు పట్టించుకోరని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పెట్టుకున్న అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), కేసీఆర్ (KCR) ఏమయ్యారో చూసుకో రేవంత్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరి మెప్పు కోసం ఆ మాటలు మాట్లాడుతున్నారో చెప్పాలని డీకే అరుణ, సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

Next Story