అసలు విషయాలు పక్కన పెట్టి మత రాజకీయాలా?.. రాహుల్‌గాంధీపై ఎంపీ డీకే అరుణ ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2024-07-04 13:32:32  IST  )

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై డీకే అరుణ మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు హింసకు పాల్పడతారంటూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాహుల్ గాంధీ మాట్లాడారని మండిపడ్డారు. గురువారం మహబూబ్ నగర్ లో మాట్లాడిన ఆమె.. ప్రతిపక్ష నేత అసలు విషయాలు పక్కన పెట్టి మత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ వ్యాఖ్యలను కార్యకర్తలందరూ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని దుయ్యబట్టారు.

Next Story