- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై: DK Aruna
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గల్లీలో కుస్తీ పడుతున్నాయని, అదే ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని, ఇది పార్లమెంట్ సమావేశాల్లో బహిర్గతమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

X
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గల్లీలో కుస్తీ పడుతున్నాయని, అదే ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని, ఇది పార్లమెంట్ సమావేశాల్లో బహిర్గతమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఇరు పార్టీలు వ్యవహరించిన తీరుపై ఆమె బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, వారు గతంలో కలిసి పనిచేశారని, భవిష్యత్తులోనూ కలిసి పని చేస్తాయని డీకే అరుణ పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీపై లేనిపోని బురద జల్లుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినా బీఆర్ఎస్‌కు వేసినా ఒకటేనన్న విషయంపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీకే అరుణ కోరారు.
Next Story






