- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DK Aruna: ఏ మొఖం పెట్టుకుని ఢిల్లీలో ప్రచారం.. రేవంత్ రెడ్డికి డీకే అరుణ కౌంటర్
సీఎం రేవంత్ రెడ్డికి డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పథకాల అమలుపై మహారాష్ట్ర, హర్యానాలో చెప్పిన అబద్దాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీలో చెబుతున్నారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) విమర్శించారు. శుక్రవారం నాంపల్లిలోని స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆమె.. తెలంగాణలో తమ పాలనను చూసి ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ (KCR) పై వ్యతిరేకతతో తప్పిదారిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీటంపై కూర్చున్నారని అంతే తప్ప కాంగ్రెస్ పై ప్రేమతో ప్రజలు ఓట్లు వేయలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ఇంకా ఎంతకాలం పాత పాట పడతారని నిలదీశారు. ఢిల్లీ ప్రజలు రేవంత్ అబద్ధాలను విశ్వసించడం లేదని ఆ పార్టీని విశ్వసించే పరిస్థితుల్లో కూడా లేదన్నారు. ఢిల్లీలో మరోసారి కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని ఎవరెన్ని కుట్రలు చేసినా హస్తినా పీఠం మాదే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశారా? రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు 2500 భృతి ఇచ్చారా? మరి ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీకి వెళ్లి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ విచారణలో అన్ని బయటకు వస్తాయి:
ఈడీ విచారణలో కేటీఆర్ (KTR) ను ఏ ప్రశ్నలు అడిగారనేది ఆయన బయట చెప్పకూడదు. కానీ కేటీఆర్ చెబుతున్నారన్నారు. లోపల అడిగింది కేటీఆర్ బయట చెప్పేది ఒక్కటేనా అనేది కూడా తెలీదన్నారు. కేటీఆర్ ఫార్ములా-ఈ కార్ రేస్ అంశంలో తొందర ఎందుకు విచారణలో అన్ని బయటకు వస్తాయని లెట్స్ వెయిట్ అండ్ సీ అన్నారు. ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడంలో నా వంతు కృషి చేస్తానని తానూ ఢిల్లీ ప్రచారంలో పాల్గొంటానన్నారు. ఢిల్లీలో పరిపాలన గాడి తప్పిందని విమర్శించారు. ప్రజల అవసరాలు తీర్చడం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆప్ ఫెయిల్ అయ్యిందన్నారు.






