- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండి సంజయ్‌ను అభినందించిన డీకే అరుణ
by GSrikanth |
బీసీలకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించడంపై ఆమె బండి సంజయ్, లక్ష్మణ్‌కు అభినందనలు తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించడంపై ఆమె బండి సంజయ్, లక్ష్మణ్‌కు అభినందనలు తెలిపారు. ఇన్నాళ్లూ బీసీలకు కేసీఆర్ చేస్తున్న అన్యాయాన్ని ఈ డిక్లరేషన్‌తో న్యాయం చేస్తామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ డిక్లరేషన్‌లో ప్రకటించిన అంశాలన్నింటినీ తప్పక అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నామమాత్రంగా మారిన బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం కమిషన్‌ను పటిష్ట పరచడమే బీజేపీ లక్ష్యమన్నారు. బీసీ జనాభా అధారంగా బడ్జెట్ కేటాయింపులు, విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు ఆర్థికసాయం వంటివన్నీ వెనకబడిన వర్గాలకు మేలు చేస్తాయని డీకే అరుణ పేర్కొన్నారు.
Next Story






