- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి కార్మికులకు దీపావళి శుభవార్త.. ఒక్కో కార్మికుడికి రూ.లక్ష మూడు వేల బోనస్
సింగరేణి కార్మికులకు ఇప్పటికే దసరా బోనస్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం ... ఇప్పుడు దీపావళి ముందు కార్మికులకు మరో తీపి కబురును అందించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి కార్మికులకు ఇప్పటికే దసరా బోనస్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం ... ఇప్పుడు దీపావళి ముందు కార్మికులకు మరో తీపి కబురును అందించింది. దీపావళి బోనస్ గా పిలుచుకునే పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (పి.ఎల్.ఆర్) స్కీం బోనస్ కింద ఒక్కొక్క కార్మికునికి రూ. 1.03 లక్షలు బోనస్ చెల్లింపునకు సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులందరికీ ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయూత అందిస్తోందని పేర్కొన్నారు. దీపావళి బోనస్ గా రూ.400 కోట్లను చెల్లించనున్నట్లు తెలిపారు. 39,500 మంది కార్మికులకు బోనస్ ప్రయోజనం దక్కుతుందని ప్రకటించారు. డిఫ్యూటీ సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 18న కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించనున్నట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు.
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన రాష్ట్ర్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కార్మికుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మరింత అంకితభవంతో పనిచేయాలని ఆయన కార్మికులను కోరారు. బోనస్ సొమ్మును కుటుంబ అవసరాలకు సద్వినియోగం చేయాలని లేదా ప్రభుత్వ పొదుపు సంస్థల్లో పొదుపు చేసుకుని సద్వినియోగం చేసుకునాలని పిలుపునిచ్చారు. ఈ దీపావళి బోనస్ కేవలం కార్మికులకు మాత్రమే వర్తిస్తుందని... అధికారులకు వర్తించదని తెలిపారు. భూగర్భంలో 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనులు, సర్ఫేస్ లో 240 మస్టర్లు పూర్తి చేసిన వారికి రూ 1.03 లక్షల పూర్తి బోనస్ అందుతుందన్నారు. అంతకంటే తక్కువ దినాలు పని చేసిన వారికి నిష్పత్తి ప్రకారం బోనస్ చెల్లిస్తామన్నారు.






