- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీపావళి ఎఫెక్ట్: తెలంగాణ ప్రజలకు కీలక విజ్ఞప్తి
దీపావళి పండుగ(Diwali Festival) సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) శుభాకాంక్షలు తెలియజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండుగ(Diwali Festival) సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగ చీకట్లపై వెలుగుల విజయం, చెడుపై మేలుకి చిహ్నంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందం నింపుతూ కుటుంబాల్లో సౌభాగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ స్నేహం, సౌహార్దం, సోదరభావంతో కలిసి దీపావళిని జరుపుకోవాలని కోరారు. పండుగలు సమాజంలో ఐక్యత, సామరస్యానికి ప్రతీకలని, అందరి జీవితాల్లో సంతోష దీపాలు వెలిగించాలని ఆయన అభిలషించారు. ఈ పండుగ సమయంలో పటాకులు పేల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పర్యావరణాన్ని కాపాడే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాజంలో ప్రేమ, శాంతి, సౌహార్ద వాతావరణం నెలకొని రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించిన మహేష్ కుమార్ గౌడ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.






