- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో వివాదంలో దివ్వెల మాధురి.. ఏడుకొండలపై ఆమె పనికి విమర్శలు
తిరుమల కొండపై మరోసారి దివ్వెల మాధురి ఎమ్మెల్సీ దువ్వాడ జంట చర్చనీయాశంగా మారారు. మాధురి చేసిన పని పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తిరుమలలో దివ్వెల మాధురి వ్యవహారం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల దివ్వెల మాధురి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే వేడుకలను మాధురి ఏడుకొండలపై గెస్ట్ హౌస్‍లో నిర్వహించారు. తిరుమల కొండపైకి కేకులు తీసుకువెళ్లడంపై నిషేధం ఉన్నప్పటికీ తనూజతో కేక్ కట్ చేయించింది మాధూరి. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‍పై మాధురి పోస్టు చేశారు. దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఉదయం దైవ దర్శనాలు సాయంత్రం సెలబ్రేషన్స్ అంటూ ఆమె చేసిన పని పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సారీ చెప్పినా మళ్లీ పాత కథే..
ఇటీవల తిరుమల కొండలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. దీంతో తిరుమల పవిత్రతను కాపాడేందుకు అధికారులు సీరియస్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే బర్త్ డే వేడుకలపై ఆంక్షలు ఉన్నప్పటికీ మాధురి మాత్రం తనూజ చేత కేక్ కట్ చేయించడం చర్చకు దారి తీసింది. దీంతో వారు కొండపైకి కేక్ ఎలా తీసుకు వెళ్లారనే దానిపై విజినెల్స్ ఆరా తీస్తోంది. అయితే దివ్వెల మాధురి గతంలోనూ దువ్వాడ శ్రీనివాస్‍తో కలిసి తిరుమల కొండపై రీల్స్ చేస్తూ మీడియాకు చిక్కారు. వారి తీరుపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మాధురి క్షమాపణలు చెప్పారు. మళ్లీ ఎప్పుడూ కొండపై అపచారాలు చేయనని సారీ చెప్పారు. అయినా మరోసారి ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.






