- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్‌ను పార్క్ హయత్ హోటల్‌లో కలిశా.. సీక్రెట్‌ను బయటపెట్టిన దివ్వెల మాధురి
దివ్వెల మాధురి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో రిలేషన్ షిప్‌లో ఉందని ప్రచారంతో ఆమె ఓ సెలబ్రిటీ అయిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్ : దివ్వెల మాధురి(Divvala Madhuri). ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(MLC Duvvada Srinivas)తో ఆమె రిలేషన్ షిప్‌లో ఉందని ప్రచారం ఊపందుకోవడంతో మాధురి ఓ సెలబ్రిటీ అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ల(Tollywood heroine)కు ఉన్న క్రేజీ ఈమెకు ఉందంటే అతిశయోక్తి కాదు. ఇంతలా మర్మోగిపోతుంది దివ్వెల మాధురి పేరు. ఇటు టీవీ చానళ్ల ఇంటర్వ్యూలు, అటు సోషల్ మీడియాలో రీల్స్‌లో హంగామా చేస్తోంది. ఈమె స్టార్‌డమ్ చూసిన కొన్ని ప్రైవేట్ కంపెనీలు దివ్వెల మాధురితో ప్రమోషన్ యాడ్స్ చేయించాయంటే ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమసో అర్థం అవుతుంది. ఇదంతా ఎలా ఉన్నా.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్(KTR) గురించి మాధురి ఓ టాప్ సీక్రెట్‌ను బయటపెట్టినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న కథనం ప్రకారం.. ‘‘కేటీఆర్‌తో తనకున్న పరిచయం గురించి చెప్పుకొచ్చింది. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్(Producer Bellamkonda Suresh) ద్వారా తనకు కేటీఆర్ పరిచయం అయ్యారన్న ఆమె.. ఆయన్ను రెండు,మూడు సార్లు పార్క్ హయత్ హోటల్లో(Park Hyatt Hotel) కలిశానని తెలిపింది. నేను పెద్ద పొలిటిషయన్‌ను అనే గర్వం ఆయనలో అస్సలు ఉండదని.. చాలా సరదాగా, జాలీగా ఉంటారని కితాబు ఇచ్చింది. అంతేకాదు.. కేటీఆర్ స్టైల్‌ను దువ్వాడ శ్రీనివాస్ ఫాలో అవుతుంటారని మాధురి టాప్ సీక్రెట్‌ను బయటపెట్టింది. నేటి రాజకీయాల్లో పైస్థాయికి వెళ్లాలంటే ఎంతో ఓపిక అవసరమని.. అది కేటీఆర్‌కు కావల్సినంత ఉందన్న ఆమె.. ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయాక కేటీఆర్‌కు తన మధ్య కలుసుకోవడానికి గ్యాప్ వచ్చిందని మాధురి చెప్పుకొచ్చింది’’. అని ఉంది.
అయితే ఈ ప్రచారంపై అధికారికంగా దివ్వెల మాధురి స్పందించింది. అసలు కేటీఆర్‌తో తనకు ముఖపరిచయమే లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కథనం పూర్తిగా అవాస్తవని ఆమె తెలిపింది. పరిచయం లేని వ్యక్తిని పార్క్ హయత్ హోటల్లో ఎలా కలుస్తానని ప్రశ్నించింది. అదంతా తప్పుడు ప్రచారమని, దానిని ఎవరూ నమ్మవద్దని ఆమె కోరింది.






