Flash News: టికెట్ ధరల పెంపుపై ఓజీ చిత్రయూనిట్‌కు ఊరట

by Naga Rani Yarlagadda |

ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓను గురువారం హైకోర్టు సస్పెండ్ చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.

Flash News: టికెట్ ధరల పెంపుపై ఓజీ చిత్రయూనిట్‌కు ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓను గురువారం హైకోర్టు సస్పెండ్ చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ సస్పెన్షన్ పై ఓజీ చిత్రయూనిట్ కు స్వల్ప ఊరట లభించింది. టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రేపటి వరకూ సస్పెండ్ చేసింది. దీంతో రేపటి వరకూ పెంచిన టికెట్ ధరలే ఉండనున్నాయి.

పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రీమియర్ షోలు నిన్న రాత్రి పడగా.. నేడు ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలైంది. ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ జీఓ జారీ చేయగా.. ప్రీమియర్ షో టికెట్ ధర రూ.800 (జీఎస్టీతో కలిపి), అక్టోబర్ 4 వరకూ సింగిల్ స్క్రీన్స్ లో ఒక టికెట్ పై రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.150 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.275 వరకూ, మల్టీప్లెక్సుల్లో టికెట్ రేటు రూ.500 వరకూ ఉంది.

Next Story