డైవర్షన్ పాలిటిక్స్ బీజేపీకి అలవాటే.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

by Kema Shiva Kumar |

నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో ఢిల్లీలోని ఎకానమిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) కాంగ్రెస్ అగ్రనేతలపై సహా మరికొందరిపై కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

డైవర్షన్ పాలిటిక్స్ బీజేపీకి అలవాటే.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో ఢిల్లీలోని ఎకానమిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) కాంగ్రెస్ అగ్రనేతలపై సహా మరికొందరిపై కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో ఆ ఎఫ్‌ఐఆర్‌లో సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)లతో పాటు మరో ఆరుగురిపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాలతో పాటు యంగ్ ఇండియా సంస్థ కూడా కుట్ర, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది. వారంతా కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులపై అధికారాన్ని పొందారని ఆరోపించింది.

ఈ క్రమంలోనే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కొత్త ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో తమ అగ్రనేతలపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు పార్లమెంటులో చర్చకు రాకుండా ఉండేందుకు నేషనల్ హెరాల్డ్ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వెంట దేశం మొత్తం ఉందని.. భయపడే ప్రసక్తే లేదని అన్నారు. పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు వచ్చినా.. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం బీజేపీకి అలవాటేనని మంత్రి పొన్నం చురకలంటించారు.

Next Story