TG: సర్పంచ్ ఎన్నికల వేళ కలెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం

by Prasad Jukanti |   (  Updated:2025-11-22 11:38:46  IST  )

సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే సమర్ధులైన అధికారులను జిల్లాలలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

TG: సర్పంచ్ ఎన్నికల వేళ  కలెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్ర పరిపాలన విభాగంలో కీలక మార్పులకు ప్రభుత్వం (Telangana government) శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 32 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం ఇక ఐఏఎస్‍ల బదిలీలపై (IAS Transfers) ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. మూడు నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో రాజన్న సిరిసిల్ల, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి జిల్లాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కలెక్టర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి తమ పని తీరు మార్చుకోవాలని పలు సందర్భాల్లో సూచనలు చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు (local body elections) సిద్ధమైంది. రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు సమర్థులైన జిల్లా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం ఐఏఎస్‍ల బదిలీకి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Read More... సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అధికారిక ఉత్తర్వులు జారీ

Next Story