- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Ponnam : ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డుల పంపిణీ : మంత్రి పొన్నం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government)కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) పంపిణీకి సన్నద్ధమైంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government)కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) పంపిణీకి సన్నద్ధమైంది. మార్చి 1నుంచి అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పంపిణీ చేయనుందని(Distribution from March 1st) ఎక్స్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)వెల్లడించారు. మార్చి 1వ తేదీన ఒకే రోజున లక్ష కొత్త రేషన్ కార్డుల పంపిణీ(One lakh new ration cards distributed in a single day) చేయనున్నట్లుగా పొన్నం వెల్లడించారు.
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంపిణీ చేస్తమని తెలిపారు. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామన్నారు. స్వరాష్ట్రంలో పదేండ్ల తర్వాత పేద బిడ్డల రేషన్ కార్డుల కల నెరవేరబోతుందని పొన్నం పేర్కొన్నారు.
వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న కొత్త రేషన్ కార్డుల జారీని ప్రారంభించింది. పైలట్ గ్రామాల వారిగా 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. దీంతో మిగతా గ్రామాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగింది. ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిపడింది. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు బ్రేక్ వేసిన ప్రభుత్వం తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పంపిణీకి నిర్ణయం తీసుకుంది. మార్చి 1న ఎన్నికలు జరగని రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో కొత్త కార్డులు ఇస్తారు.
మార్చి 8 నుంచి అన్ని జిల్లాల్లో కార్డులు ఇస్తారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం 5.12 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎవరైనా కొత్త రేషన్ కార్డు కోసం ఇప్పటికి అప్లై చేసుకోకపోతే.. ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. దీనికి గడువు తేదీ ఏమీ లేదు. నిరంతరం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. మీసేవా కేంద్రాల ద్వారా రూ.50 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు స్టేటస్ చూసుకోవడానికి ఒక రిఫరల్ నంబర్ కూడా ఇస్తారు.






