ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ.. సంతోషంతో డ్యాన్స్ చేసిన బామ్మ

by Muthe.Rajitha |   (  Updated:2025-07-14 15:49:53  IST  )

సోమవారం ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు.

ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ.. సంతోషంతో డ్యాన్స్ చేసిన బామ్మ
X

దిశ, వెబ్ డెస్క్ : సోమవారం ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ల పట్టా అందుకున్న ఓ వృద్ధురాలు భట్టికి శిరసు వంచి నమస్కారం చేసింది. అంతటితో ఆగకుండా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యి స్టేజీ మీదనే డ్యాన్స్ చేసింది. వృద్ధురాలి ఆనందానికి సభలో ఉన్న భట్టి విక్రమార్క మరియు ఇతర రాజకీయ ప్రతినిధులతోపాటు, అధికారులంతా ఆశ్చ్యర్యపోయారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక్క కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని, ప్రతి పేద కుటుంబానికి ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రతివారం ఇంటి బిల్లులు చెల్లిస్తా అన్నారు. ఇళ్ల నిర్మాణం పండుగలా జరుపుకోవాలని, తనను గృహప్రవేశానికి పిలిస్తే తప్పక వస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, ప్రతి మహిళకు ఆర్థిక స్థిరత్వం కల్పించాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉందని ఆయన పేర్కొన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పేదల కష్టాలను స్వయంగా చూశానని, పేదల ఇంటి కలను నెరవేర్చే ప్రభుత్వం ఇదే అని స్పష్టం చేశారు. వీడియో

Next Story