- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని మండల కేంద్రాల్లో సన్న బియ్యం పంపిణీ : సీఎస్ ఆదేశాలు
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించేందుకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించేందుకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. సీఎస్ శాంతి కుమారి మంగళవారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని, అందుకు తగిన విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
ఇప్పటికే యాభై శాతానికి పైగా సన్నబియ్యం చౌక ధరల (రేషన్ షాప్) దుకాణాలకు వచ్చాయని, మిగిలిన స్టాక్‌ను రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు. బియ్యం నాణ్యత, పరిమాణానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే.






