- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరద ముప్పు ప్రాంతాల్లో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ
: రాష్ట్రంలో ఇటీవల వరద ముప్పకు గురైన ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో స్వచ్చంద సంస్ధలు ఆదుకునేందు ముందుకు వచ్చాయి. శుక్రవారం ఏడు లారీల వరద సహాయ కిరాణా కిట్లను రాష్ట్ర పౌరసరఫరాల కమిషన్ డి.ఎస్. చౌహాన్ జెండా ఊపి ప్రారంభించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇటీవల వరద ముప్పకు గురైన ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో స్వచ్చంద సంస్ధలు ఆదుకునేందు ముందుకు వచ్చాయి. శుక్రవారం ఏడు లారీల వరద సహాయ కిరాణా కిట్లను రాష్ట్ర పౌరసరఫరాల కమిషన్ డి.ఎస్. చౌహాన్ జెండా ఊపి ప్రారంభించారు. బాధిత పట్ల నెస్టేల్, బోస్కోనెట్స్వచ్చంద సంస్ధలు ఉదాతర చూపించాయి.
నిత్యావసర సరుకులైన బియ్యం, పప్పులు, చక్కెర, ఉప్పు, శుద్ధి చేసిన నూనె, ధాన్య పొడి, హల్దీ పొడి, గరం మసాలా, చింతపండు, టీ పొడి, మిర్చి పొడి. ప్రతి ప్యాకేజీలో 10 కిలోల బియ్యం, ఒక కిలో పప్పు, లీటర్నూనెలు అందేలా ప్యాకెట్లు సిద్దం చేశారు. వరద ముప్పు ప్రాంతాలపై కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్, కొత్తగూడెం ములుగు ఐదు జిల్లాల్లోని 5 వేల లబ్ధిదారుల కుటుంబాలకు కిరాణా కిట్లను పంపిణీ చేస్తారు.ఈ సందర్భంగా డి.ఎస్. చౌహాన్ మాట్లాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టినందుకు నెస్టేల్, ఎన్జీఓ బోస్కోనెట్ సంస్ధల నిర్వహకులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలకు స్వచ్చంద సంస్ధలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని సూచించారు.






