CM Revanth Reddy : 'చంద్రబాబును నేనే స్వయంగా ఆహ్వానిస్తా' : సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

by Muthe.Rajitha |   (  Updated:2025-06-20 12:30:17  IST  )

ఢిల్లీ(Delhi) పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

CM Revanth Reddy : చంద్రబాబును నేనే స్వయంగా ఆహ్వానిస్తా : సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ(Delhi) పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బనకచర్లపై (Banakacharla) ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదన్నారు. చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో కూర్చుని మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ వివాదం ఉండేది కాదన్నారు. కేంద్రానికి పీఎఫ్ఆర్(PFR) ఇచ్చే ముందే తెలంగాణతో ఏపీ చర్చించి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు.

జూన్ 23 తెలంగాణ కేబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting) నిర్వహించి, మంత్రులతో ఈ వ్యవహారాన్ని చర్చిస్తామని అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఏపీని బనకచర్లపై చర్చలకు ఆహ్వానిస్తామని అన్నారు. కావాలంటే ఏపీ సీఎం చంద్రబాబును నేనే స్వయంగా మీటింగ్ కు ఆహ్వానిస్తామని తెలిపారు. ఎవరి ప్రయోజనాల కోసమో తమ రాష్ట్ర హక్కులను వదిలేసుకోబోమని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

Next Story