- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ సమావేశాల వేళ ‘తెలంగాణ సమాఖ్య’ సంచలన నిర్ణయం.. 14న ఉద్యమకారుల కీలక చర్చ
"తెలంగాణ సమాఖ్య", ఉద్యమ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 14న సోమాజిగూడ ప్రెస్స్ క్లబ్ లో కార్యాచరణపై రౌంట్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ కరుణాకర్ దేశాయి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం లక్షలాది మంది రోడ్డెక్కారు.. ధర్నాలు చేశారు. కొందరు అమరులయ్యారు. దాని వల్లనే రాష్ట్రం సిద్ధించిందని తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయి అన్నారు. ఈ సందర్భంగానే "తెలంగాణ సమాఖ్య", ఉద్యమ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 14న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సోమాజిగూడ ప్రెస్స్ క్లబ్ లో కార్యాచరణపై రౌంట్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలపై తగిన కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2011 మార్చి 10న 15 ఏండ్ల క్రితం చేపట్టిన మిలియన్ మార్చ్ ఓ మరుపు రాని ఉద్యమ చరిత్ర. దాన్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ఉద్యమకారుల సంక్షేమం కోసం చర్చించనున్నట్లు చెప్పారు. తెలంగాణ కోసం అమరులైన వందలాది మందికి నివాళ్లు అర్పించి, వారి ఉద్యమ స్ఫూర్తిని మననం చేసుకుంటూ కార్యాచరణ రూపకల్పనకు సిద్ధం కావాలన్నారు. ఈ రౌంట్ టేబుల్ సమావేశంలో పలువురు రాజకీయ నేతలు, ఉద్యమకారులు, అడ్వకేట్లు, రిటైర్డ్ అధికారులు, సీనియర్ జర్నలిస్టులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఎవరైనా రౌంట్ టేబుల్ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాన్ని వెల్లడించడానికి అవకాశం ఉంటుందన్నారు.






