తెలంగాణ పర్యాటక ప్రత్యేకతలివే!

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-08 16:30:14  IST  )

తెలంగాణ పర్యాటక ప్రత్యేకతలివే!

తెలంగాణ పర్యాటక ప్రత్యేకతలివే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా తెలంగాణ అనుభవాలు -వారసత్వం, సంస్కృతి - ఫ్యూచర్ రెడీ టూరిజం అనే అంశంపై మంగళవారం ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు ప్యానెల్ చర్చ జరుగుతుంది. ఈ చర్చలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు. శతాబ్దాల తెలంగాణ వారసత్వం, సంప్రదాయాలు, సంస్కృతి, భవిష్యత్‌ దృష్టితో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే మార్గదర్శక అంశాలపై ఈ చర్చ జరగనుంది. ఈ చర్చలో ఎక్స్పీరియం చైర్మన్ రాందేవ్ రావు, ఐహెచ్ సీఎస్ (ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ ప్రభాత్ వర్మ, రామోజీ ఫిల్మ్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ఏ.వి.రావు, వెంకట రమణ, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ పాల్గొంటారు. తెలంగాణ పర్యాటక ప్రత్యేకతలు, పెట్టుబడి అవకాశాలు, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలిగే పర్యాటక పారిశ్రామిక వాతావరణాన్ని ఏర్పరచడంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.

Next Story