- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాటాలు పంచుకోవడం కోసం చర్చించారా?.. చిరంజీవితో ప్రొడ్యూసర్ల సమావేశంపై సీపీఐ నారాయణ ఫైర్
పెద్ద సినిమాల టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. చిరంజీవి నివాసంలో జరిగిన నిర్మాతలతో మీటింగ్‌ను ఆయన తప్పుబట్టారు

దిశ, డైనమిక్ బ్యూరో: భారీ బడ్జెట్ చిత్రాలు, వినోదం పేరుతో సినీ పరిశ్రమ సామాన్య ప్రేక్షకులపై భారం మోపడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సినిమా వినోదం మాత్రమేనని పెద్ద సినిమాలకు టికెట్లు ఎందుకు పెంచుతారని నిలదీశారు. ఇష్టానుసారంగా సినిమా టికెట్ల ధరలు పెంచడం, బెనిఫిట్ షోలు నిర్వహించడంపై ఆయన విమర్శలు గుప్పించారు. సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలపై చర్చించేందుకు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నివాసంలో పలువురు ప్రొడ్యూర్లు సమావేశం కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటాలు పంచుకోవడం కోసం ఈ సమావేశంలో చర్చించారా అంటూ మండిపడ్డారు.
మార్గదర్శకాలేవి?:
భారీ చిత్రాల నిర్మాణ బడ్జెట్లను కారణంగా చూపుతూ సినీ నిర్మాతలు, పరిశ్రమ ప్రతినిధులు బెనిఫిట్ షోలకు, ప్రత్యేక టికెట్ ధరల పెంపునకు పదేపదే అనుమతులు కోరుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి అనుమతులను సులబంగా మంజూరు చేస్తున్నాయని ఇది అంతిమంగా సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని అన్నారు. సినిమా టికెట్ల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. సినిమా టికెట్ ధరలు, కళారంగానికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలన్నారు. ఇటువంటి గైడ్ లైన్ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద లేవన్నారు. ఇప్పటికైనా ఓ పాలసీ రూపొందించి దాని ప్రకారం ముందుకు వెళ్లాలలని సూచించారు. అలా కాకుండా ఇష్టానికి టికెట్లు పెంచుకుంటా వెళ్తే ప్రజలు దోపిడీకి గురవుతున్నారన్నారు.






