- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణా కమిటీ సీరియస్
కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి(Mallu Ravi) స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి(Mallu Ravi) స్పందించారు. రేపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశం అయ్యి, తనతో మాట్లాడతానని పేర్కొన్నారు. అయితే తాను మంత్రి పదవి కోసం తాను ఎవరి కాళ్లు మొక్కనని అన్నారు. తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని, తాను ప్రజల కోసం పనిచేసినప్పటికీ తనకు మంత్రి పదవి ఇవ్వకుండా మొండి చెయ్యి చూపారని ఫైర్ అయ్యారు.
కోమటిరెడ్డివ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదాన్ని రేకెత్తించాయి. ఈ వ్యాఖ్యలపై మల్లు రవి స్పందిస్తూ.. రాజగోపాల్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడటం సరికాదని, ఇటువంటి అంశాలను పార్టీ హైకమాండ్ పరిష్కరిస్తుందని అన్నారు. రేపు మరోసారి కోమటిరెడ్డితో భేటీ అయ్యి, సమస్యను సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని అన్నారు.






