- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 10న క్రమశిక్షణ కమిటీ సమావేశం
ఈ నెల 10న గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 10న గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనున్నది. ప్రజా ప్రతినిధులు, నాయకులపై వచ్చని ఫిర్యాదులపై కమిటీ చర్చించనున్నారు. అనంతరం అధిష్టానానికి నివేదిక అందజేసి, పార్టీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన పరిమితులను దిక్కరించిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఈ కమిటీని నియమించారు.
ఇటివలే ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డిపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని రోజుల కిందట మంత్రి కొండా సురేఖ వరంగల్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె భర్తకు కూడా కొన్ని ఆరోపణలు చేసినట్లు కొందరు నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ప్రభుత్వంపై కూడా ఆరోపణలు చేసినట్లు ఫిర్యాదుల వచ్చాయి. ఈ అంశాలపై కమిటీ సుధీర్ఘంగా చర్చించనున్నది. అనంతరం చర్చించిన అంశాలపై సమగ్ర నివేదికను పార్టీ అధిష్టానికి అందజేయనున్నారు.






