- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తృటిలో తప్పిన ముప్పు.. డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం
ములుగు జిల్లా వెంకటాపురం వద్ద తెలంగాణ డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శివధర్‌రెడ్డి (Shivadhar Reddy) కాన్వాయ్ ట్రయల్ రన్ సందర్భంగా ఇవాళ ప్రమాదం చోటుచేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం (Venkatapuram) సమీపంలో జరిగిన ఈ ఘటనలో వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర డీజీపీ పర్యటనకు ముందు భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసులు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటాపురం వద్ద వాహనాలు వేగంగా వెళ్తుండగా, ఒక పోలీసు వాహనం అదుపుతప్పి ముందు వెళ్లున్న వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం అందడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాహనాలను పక్కకు తొలగించి పరిస్థితిని సమీక్షించారు. డీజీపీ పర్యటనకు సంబంధించి భద్రతా పరమైన లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది.
డీజీపీ పర్యటనకు ప్రాధాన్యత..
కాగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి సువర్ణతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన కర్రెగుట్టల్లోని పామునూరు సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపును పరిశీలించనున్నారు. అనంతరం పోలీస్ ఔట్‌పోస్ట్‌కు భూమి పూజ చేసి మారుమూల గ్రామలకు నిర్మిస్తున్న రోడ్లను ఆయన పరిశీలించనున్నారు. మావోయిస్టుల నుంచి కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న వేళ డీజీపీ శివధర్ రెడ్డి పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.






