మరోసారి రచ్చకెక్కిన మంత్రుల విభేదాలు.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-14 04:05:37  IST  )

రాష్ట్ర మంత్రుల మధ్య తలెత్తిన వివాదాలు, విభేదాలకు స్వస్తి పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు.

మరోసారి రచ్చకెక్కిన మంత్రుల విభేదాలు.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రుల మధ్య తలెత్తిన వివాదాలు, విభేదాలకు స్వస్తి పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మినిస్టర్ల మధ్య వివాదాలతో పార్టీకి, ప్రభుత్వానికి జరుగుతున్న నష్ట నివారణ కోసం చర్యలు చేపట్టారు. సోమవారం పలువురు మంత్రులతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. ఇకపై మంత్రులు ఎవ్వరూ మీడియా ఎదుట వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని సూచించినట్టు సమాచారం. మంత్రుల కు ఏమైనా అపోహలు, అనుమానాలు ఉన్నా, ఏదై నా విషయంపై స్పష్టత కావాలన్నా తనతో స్వయం గా మాట్లాడాలని ఆయన సూచించినట్లుగా టాక్.

స్వీట్ వార్నింగ్

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల కన్నా చిన్న చిన్న వివాదాలకే మీడియాలో ఎక్కువ ప్రాముఖ్యత దొరుకుతుందని తెలిపినట్టు సమాచారం. దీని వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని చెప్పినట్టు‌గా తెలిసింది. అధికార పార్టీలో ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా మంత్రులుగా ఉన్నప్పుడు బాధ్యత ఎక్కువ ఉంటుందని సూచించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగాన్ని సమన్వ యం చేయాల్సిన వారే వివాదాలకు తావు ఇవ్వడం వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని, ఇకపై బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని, క్రమశిక్షణను ఉల్లంఘించవద్దని సున్నితంగా హెచ్చరించినట్టు సమాచారం. శాఖ లు, జిల్లాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ఏవైనా సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించినట్టుగా తెలిసింది. సమన్వయంతో పనిచేద్దామని, ప్రజలకు రెట్టింపు ఉత్సాహంతో సేవ చేద్దామని సూచించినట్లుగా సమాచారం.

వరుస వివాదాలు

గత కొన్ని రోజులుగా వరుసగా మంత్రుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పార్టీ నాయకులు, కేడర్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్వయంగా దిద్దుబాటు చర్యలకు దిగినట్టుగా సమాచారం. మరీ ముఖ్యంగా వరంగల్, కరీంనగర్​ జిల్లాలకు చెందిన పలువురు మంత్రుల మధ్య వివాదాలు ఎక్కువగా ఉన్నట్టుగా సీఎం గుర్తించారు. మంత్రులు పొన్నం, అడ్లూరి మధ్య మొదలైన వివాదానికి ఫుల్‌స్టాప్ పడే సమయంలో మరో మంత్రి వివేక్..​మంత్రి అడ్లూరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరింత అజ్వాన్ని పోశాయి. అదే సమయంలో మేడారం జాతర విషయంలో ఉమ్మడి వరంగల్​జిల్లాలో కొండా సురేఖ, ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి మధ్య వివాదం చోసుకున్నది. వీటన్నింటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు నేరుగా సీఎం రంగంలోకి దిగినట్టు తెలిసింది.

READ MORE ......

అసంతృప్తులకు కాంగ్రెస్ బుజ్జగింపులు.. కీలక పదవులిస్తామని హామీ!




Next Story