CM రేవంత్ రెడ్డిని కలిసిన దర్శకుడు సుకుమార్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-19 15:58:56  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్ నివాసంలో ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్(Director Sukumar) కుటుంబసమేతంగా కలిశారు.

CM రేవంత్ రెడ్డిని కలిసిన దర్శకుడు సుకుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్ నివాసంలో ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్(Director Sukumar) కుటుంబసమేతంగా కలిశారు. సుకుమార్ కూతురు సుకృతి నటించిన ‘గాంధీ తాత చెట్టు’ సినిమాకు గాను ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డు పొందారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుకృతిని సన్మానించి అభినందించారు. సుకుమార్ ఫ్యామిలీతో పాటు నిర్మాత యలమంచిలి రవిశంకర్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా, సుకుమార్ – తబిత దంపతులకు ఇద్దరు సంతానం. కూతురి పేరు సుకృతి వేణి కాగా కుమారుడి పేరు సుక్రాంత్. వీరిలో సుకృతి తండ్రి అడుగు జాడల్లోనే పయనిస్తోంది. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనను కనబర్చింది. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యిందీ స్టార్ కిడ్.

Next Story